2002 లో విక్రమ్ రచనలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ‘మన్మధుడు’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నాగార్జునపై ఎంతగా ప్రభావం పడిందంటే..టాలీవుడ్ లో ఆయనను అందరూ మన్మధుడు అని పిలిచే స్థాయికి చేరుకుంది. బ్రహ్మానందం- నాగ్ ల మద్య వచ్చే సన్నివేశాలు పొట్ట చెక్కలయ్యేలా ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా సీక్వెల్ తీయడానికి ఎంతోమంది ప్రయత్నించారు.
కానీ వర్క్ ఔట్ కాలేదు..మొత్తానికి ఈ సినిమా సీక్వెల్ కి మోక్షం లభించింది. యువ దర్శకుడు రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తుంది..అందుకోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట..దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆ మద్య సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
నేడు మధ్యాహ్నం ‘మన్మధుడు2’ టీజర్ రిలీజ్ అయ్యింది.. మరి ‘మన్మధుడు2’గా నాగార్జున్ ట్రెండ్ సృష్టిస్తారా..మరోసారి కుర్ర హీరోలకు చెక్ పెడతాడా చూడాలి. టీజర్ లో నాగార్జున చాల యంగ్ గా కనిపించటం విశేషం.