టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు 2 సినిమా ఫ్రి బిజినెస్ జోరుగా సాగుతుంది. టాలీవుడ్ లో తిరుగులేని నవ మన్మథుడిగా పేరు గడించిన అక్కినేని నాగార్జున సినిమా అంటే టాలీవుడ్ లో తిరుగుండదు. అలాంటిది ఇప్పుడు మన్మథుడు 2 పేరుతో వస్తున్న సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్మెశారు, ఎంతకు అమ్మెశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున 2002లో రొమాంటిక్ ఇమేజ్ తో మన్మథుడు సినిమా వచ్చింది. ఈ సినిమా తిరుగులేని విజయం సాధించి అక్కినేని నాగార్జున కేరీర్లో ఓ మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు అదే సినిమాకు సీక్వేల్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నిర్మాతగా మన్మథుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధంచిన టీజర్, ఫస్ట్ లుక్ లు ఆలరిస్తున్నాయి.
ఆగస్టు 9న విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నహాలు చేస్తుండగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను అత్యంత పకడ్బందిగా నిర్వహిస్తున్నారు. టీజర్, ఫస్ట్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ మేరకు చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే సాగుతుంది. అందులో భాగంగానే శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా కంపెనీ రూ.8.3కోట్లకు కొనుగోలు చేసింది.