మందు క్లాసుతో పూజా హెగ్డే.. వైరల్ అయిన వీడియో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. కానీ తాగే వారు మాత్రం తాగుతూనే ఉంటారు. కానీ సామాజిక బాధ్యతలు కలిగి ఉండిన సెలబ్రిటీలు సైతం మద్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రకటనలో నటిస్తున్నారు. అలాంటి ప్రకటనలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రముఖ బ్రాండ్ అయినటువంటి విస్కీ, వైన్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు మన హీరోయిన్లు. అలాంటి వారిలో తాజాగా రెజీనా, ఇలియానా వంటి వారు చేరిపోయారు.

ఇప్పుడు తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా రెడ్ అంటూ జింజర్ చాలెంజ్ అంటూ పెగ్గు కలిపింది. తాను వేయడమే కాకుండా ఓ ఛాలెంజ్ విసిరింది. ఈ హూక్ స్టెప్పులతో ఈ వీడియోను చేయండని తన అభిమానులను కోరింది.రీ వైబ్ ది నైట్ అంటూ పూజా హెగ్డే రచ్చ చేస్తోంది. ఇది కేవలం 25 ఏళ్లు నిండిన వారికే అని చెప్పింది. బాధ్యతాయుతంగా తాగండనే హ్యాష్ టాగ్ కూడా పెట్టేసింది.ఈ చాలెంజ్ లో విన్నర్ అయిన వారికి తానని కలిసే అవకాశం ఉంటుందని తెలియజేసింది పూజా హెగ్డే. ఇప్పుడు పూజా వేసిన హూక్ స్టెప్పులు బాగా వైరల్ గా మారుతున్నాయి.

Share.