సినీకళామతల్లి బిడ్డగా నా విన్నపం: మంచు మనోజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ప్రస్తుతం ‘మా’ (మూవీ ఆర్టిస్ అసోసియేషన్) లో వర్గ విబేధాలు చిలికి చిలికి గాలివానలా కాకుండా పెను తుఫానులా మారిపోయాయి. ఈ రోజు మంచు మనోజ్ ఈ వివాదం పై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మా ‘ సంస్థ పై మాకు పూర్తి నమ్మకం ఉందని, అందులోని సభ్యుల పై కూడా మా అందరికి చాల నమ్మకం ఉంది. తమ పై వస్తున్న అభియోగాల పై ఎవరు బయపడలేదని నేను అనుకుంటున్నా, మనం తప్పుచేయలేదు కనుక కమిటీ ముందు హాజరు అవుదాం, ఈ ఉదంతం లో ఎవరు తప్పు చేయలేదని నేను అనుకుంటున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఈ ఉదంతం పై స్పందించాలని నేను కోరుకుంటున్న అని తెలిపారు. సినీకళామతల్లి ముద్దు బిడ్డ గా ఇది నా విన్నపం అని ట్వీట్ చేసారు మనోజ్.

 

ఇక మరొక ట్వీట్ లో మనోజ్, ఒక అభిమానికి సమాధానం ఇస్తూ ఈ విధంగా స్పందించారు..

సోషల్ మీడియా లో గత కొద్దీ రోజులుగా మంచు మనోజ్ చాల యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ ఎటువంటి షూటింగ్స్ లో పాల్గొనటం లేదు, అయన చివరి చిత్రం 2017 లో విడుదల అయ్యింది, అటు తర్వాత ఇప్పటి వరకు మరొక మూవీ రిలీజ్ కాలేదు. అయితే మనోజ్ మాత్రం తన ఫ్యాన్స్ అందరితో ట్విట్టర్ ద్వారా టచ్ లోనే ఉంటున్నారు. ఇక ఈ రోజు ఉదయం ఒక అభిమాని ” అన్న మిమల్ని మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా చూడాలని ఉంది అని అడగ్గా” దానికి బదులుగా మంచు మనోజ్ ” నేను వెళ్తే తప్పకుండ అందరికి ఫసకే, మా సంస్థ అత్యంత నిజాయితీగా పని చేస్తుంది, సంస్థ పై వస్తున్న విమర్శలన్నిటికి త్వరలో ఒక కమిటీ వేసి సమాధానం చెప్తారు. మా సభ్యులు ఎవరికీ భయపడరని, వాళ్ళు ఎక్కడికి పారిపోవట్లేదని ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు.

Share.