చెయ్యి విరగ్గొట్టిన స్టోరీ ఎన్టీఆర్ నే అడగండి: మనోజ్ షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా లో చాల యాక్టివ్ గా ఉండే హీరోల్లో ఒకరు. తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంటారు హీరో మనోజ్. ఇక తాజాగా ఒక అభిమాని ” మనోజ్ అన్న చిన్నపుడు ఎవరో ఎన్టీఆర్ ని కొడితే మీరు వెళ్లి వాడి హ్యాండ్ చెయ్యి విరగ్గొట్టారటగా అన్న, ఆ స్టోరీ ఏంటో చెప్పండి అన్న ప్లీజ్” అని ఒక అభిమాని మనోజ్ ని కోరారు.

దానికి మనోజ్ సమాధానం ఇస్తూ ” ఆ విషయం తారక్ నే అడుగు, నాకంటే తనే బాగా చెప్తాడు ఈ విషయం గురించి ” అని రిప్లై చేసారు. మనోజ్, ఎన్టీఆర్ చిన్ననాటి నుండి మంచి స్నేహితులని మనందరికీ తెలిసిన విషయమే. మనోజ్ కూడా స్నేహం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడని అనేక సార్లు మీడియా ఎదుట తెలిపారు. చూద్దాం ఎన్టీఆర్ ఈ విషయం పై ఏమైనా స్పందిస్తారో లేదో. వీరిద్దరి స్నేహానికి ఈ సంఘటన కూడా ఒక చక్కటి ఉదహరణ అని చెప్పవచ్చు.

Share.