నాన్న డబ్బు ఎప్పుడు వాడుకోలేదు, మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం ఇస్తుంటారు మనోజ్. ఇక తాజాగా ట్విట్టర్ ద్వారా ఒక అభిమాని మనోజ్ ని ఒక ఇబ్బందికర ప్రశ్న అడిగారు అదేంటంటే ” మీరు ఏ పని చేయకుండా మీ తండ్రి ( హీరో మోహన్ బాబు ) సంపాదించిన డబ్బుతో జీవితాన్ని బాగా అనుభవిస్తున్నారు, సూపర్ అన్న నువ్వు…మీరు నిజంగా యువతకి ఎంతో స్ఫూర్తి ” అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.

ఇక ఈ ట్వీట్ కి నటుడు మంచు మనోజ్ సమాధానం ఇస్తూ ” నేను నిజంగా మా నాన్న డబ్బు వాడుకొని ఉంటె మా నాన్న ఎంతో సంతోషించే వారు, కానీ ఇప్పటి వరకు నేను మా నాన్న డబ్బు కానీ అతని సహాయం కానీ సినిమాలు చేయటానికి ఎప్పుడు ఉపయోగించుకోలేదు. కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ లో వెయిటర్, క్లీనర్ గా పని చేసి డబ్బు సంపాదించుకున్న.. అటు తర్వాత సొంతంగా ఒక టీం ని ఎర్పాటు చేసుకుని కొత్త దర్శకులని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ నా జీవనాన్ని సాగించే వాడిని, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా..? ” అంటూ ఘాటుగా బదులిచ్చారు హీరో మనోజ్. ప్రస్తుతం మంచు మనోజ్ తెలుగులో శ్రీకాంత్ నటిస్తున్న ఆపరేషన్ 2019 సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

Share.