జైలుకి పోదాం: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో మంచు మనోజ్ మొన్న జరిగిన ప్రణయ్ హత్య పై ఎంతగా బాధ పడ్డారో నిన్న ట్విట్టర్ ద్వారా తాను రాసిన లేఖలో అందరికి అర్ధం అయ్యింది. ఈ లేక మాన‌వత్వం కంటే కులమ‌తాలు ఎక్కువ అని ఫీల్ అవుతున్న అంద‌రి కోస‌మే అని తెలిపారు మనోజ్. ఇంకా పుట్టని ఒక పసిబిడ్డ తన తండ్రిని చూడకుండానే, కనీసం తన తండ్రి చేతి స్పర్శ కూడా తెలియకముందే సమాజం ఆ పసికందుకి తన తండ్రిని దూరం చేసింది, అని బాధ పడ్డారు మనోజ్.

ఇక నిన్న ట్విట్టర్ లో ఒక అభిమాని మనోజ్ కి ” అన్న కులం కులం అని చచ్చే ప్రతి ఒక్కరిని కొడదాం అని ఫిక్స్ అయ్యావా, అలాంటి వాళ్ళు మారారు వదేలేయ్ అన్న” అని ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్ కి సమాధానం ఇస్తూ మనోజ్ ” వాళ్ళు మారకపోతే జి *** లో కొట్టి, జైలు కి పోదాం…..తొక్క ” అని ఘాటుగా రిప్లై చేసారు. మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొంత మంది నెటిజన్స్ మనోజ్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంటే మరి కొందరు మాత్రం మనోజ్ వ్యాఖ్యలు సరదాగా తీసుకున్నారు.

Share.