సినిమాలు అందుకే మానేసా: మంచు మనోజ్ సంచలన ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో మంచు మనోజ్ ప్రస్తుతం అంతగా సినిమాల్లో నటించటం లేదు, మనోజ్ చివరగా 2017 లో గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాల్లో నటించారు. అవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఇక ఈ సంవత్సరం ఇప్పటి వరకు మంచు మనోజ్ నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సినిమా కూడా ఏది లేదని సమాచారం. ఇప్పుడు ఈ సోది అంత దేనికి అనుకుంటున్నారా ఆ టాపిక్ దగ్గరికే వస్తున్నాం ఆగండి.

ఈ రోజు ఉదయం మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా తాను సినిమాలు ఎందుకు చేయటం లేదో తెలియ చేసారు. ఒక అభిమాని ” మనోజ్ అన్న మీరు సినిమాలు ఎందుకు చేయటం లేదు ” అని అడగ్గా, ఆ ప్రశ్నకి బదులుగా హీరో మనోజ్ కొంచం వ్యంగ్యంగా ” తిక్క ” అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ ట్వీట్ నెట్ లో హాల్ చల్ చేస్తుంది.

Share.