తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ కు గుర్తింపు తెచ్చుకున్న నటులలో మంచు లక్ష్మి కూడా ఒకరు. మోహన్ బాబు కూతురు అయినప్పటికీ నటిగా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక నిర్మాతగా వ్యాఖ్యాతగా కూడా కెరియర్లు బాగానే రాణించింది మంచు లక్ష్మి. ఈ సమయంలోనే ఎన్నోసార్లు ట్రోల్ కి గురైంది. అయితే ఎవరేమనుకున్నా సరే మంచు లక్ష్మి చేయాలనుకున్న పని చేస్తూ ఉంటుంది. తాజాగా నటుడు సుమంత్ కు ట్విట్టర్ వేదికగా బర్తడే విషెస్ తెలియజేయడం జరిగింది. ఇక్కడే మరొకసారి ఆమె పైన పలు విమర్శలు ఎదురవుతున్నాయి.
సుమంత్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ .. మంచులక్ష్మి.. డార్లింగ్ సుమంత్ మరో మంచి ఏడాది నీ ముందు ఉంది అంటూ సుమంత్ తనను వెనుక నుంచి వాటేసుకున్న ఫోటోని షేర్ చేయడం జరిగింది మంచు లక్ష్మి. ఈ ఫోటోని చూసిన నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో ఎలాంటివి షేర్ చేసిన కూడా వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మంచు లక్ష్మి విదేశాలలో చదివి అక్కడే పెరగడం వల్ల ఎక్కువగా వెటర్న్ కల్చర్ను ఫాలో అవుతూ ఉంటుంది. దీంతో ఈ మాత్రానికి ఈమె పైన పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.
ఇక మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది మోహన్ లాల్ నటించిన మాన్స్టోర్ సినిమాలో లెస్బియన్ గా నటించింది. ఇక అందులో ఇమే మరొక నటితో లిప్ లాక్ చేసి పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇక సుమంత్ విషయానికి వస్తే చివరిగా సూపర్ హిట్ సినిమా సీతారామంలో కనిపించారు. ప్రస్తుతం మంచు లక్ష్మికి సుమంత్ కి సంబంధించి ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.