ఆ సమయంలో తిండి, నీరు కూడా లేక చాల ఇబ్బంది పడ్డాను: మంచు లక్ష్మి

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి నిన్న తన అధికారిక ట్విట్టర్ ద్వారా దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పై విరుచుకు పడ్డారు. ఆమె ఎయిర్ ఇండియా పై వరుస ట్వీట్లతో తన కోపాన్ని వ్యక్తం చేసారు. లక్ష్మి మంచు ట్వీట్ చేస్తూ ” ఎయిర్ ఇండియా వారు నన్ను 4 గంటల నుండి ఎయిర్ పోర్ట్ లోనే ఎదురుచూసేలా‌ చేసారు, ముందుగా ఉదయం 12.15 am ( అర్ధరాత్రి ) ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఇంకో 2 గంటలు సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక్కడి నిర్వహులు కూడా సరిగా సమాధానము ఇవ్వటంలేదు, ప్రయాణికులకు సరైన ఆహారం, నీరు సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇక చేసేదేమి లేక హైదరాబాద్ లోని సిబ్బందికి ఫోన్ చేసి, పూణే లోని విమానం ఏమైందో అడగమని చెప్పను. వారు ప్రయాణానికి వాతావరణం అనుకూలంగాలేదని, కొన్ని అనుకోని సాంకేతిక కారణాల వలన విమానాల్ని మార్చామని అబద్ధాలు చెప్పారు. ఇలా ప్రయాణికుల్ని 4 గంటలపాటు ఎదురుచూసేలా చేయటంలో మీకు వచ్చే ఆనందం ఏంటో అని తన ఆవేదన వ్యక్తం చేసారు లక్ష్మి మంచు.

ఇక మరో ట్వీట్ లో రాత్రి 9.30 కి బయలుదేరవలసిన విమానం సుమారు 5 గంటల ఆలస్యంగా ఉదయం 3 గంటలకి స్టార్ట్ అవుతుందేమో అని తెలిపారు లక్ష్మి మంచు.

Share.