టాలీవుడ్లో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మోహన్ బాబు హీరోగా విలన్ గా, కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక మోహన్ బాబు వారసత్వం నుంచి.. మంచు విష్ణు, మంచు మనోజ్ మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు పైనే అవుతుంది ప్రస్తుతం ఆడప దడప సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు.
మంచు ఫ్యామిలీ ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉండేది కానీ ఇప్పుడు ఈ కుటుంబం మీద నెగెటివీటి బాగా పెరిగిపోతూనే వస్తోంది. దీంతో హీరోలుగా రాణించలేక పోతున్నారు మంచు ఫ్యామిలీ. మంచు లక్ష్మి హీరోయిన్ గా కాకుండానే పలు షోలకు హోస్టుగా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈమె చాలా టాక్ షోలకు హోస్టుగా అదరగొట్టేస్తోంది.గతంలో ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ అనుష్క శెట్టి మీద పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి వాటి గురించి తెలుసుకుందాం.
మంచు లక్ష్మిని గత కొద్దిరోజుల నుంచి అభిమానులు సైతం టాక్ షో చేయమని అడుగుతున్నారు.. కానీ పిలిచిన వారిని ప్రతిసారి పిలవాలంటే చాలా బోరింగ్ గా ఉంటుంది కదా ఒక సారి ఇలాగే అనుష్కని రమ్మని పిలిచాం ఆమె వస్తానని చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపింది మంచు లక్ష్మి.. దాదాపుగా రూ .3కోట్ల రూపాయల వరకు అందుకు ఖర్చు వచ్చిందని తెలిపింది. కానీ ఒక్కసారిగా ఆమె భాగమతి సినిమా షూటింగ్ రావడంతో ఆమె షోకు రాలేనని చెప్పింది.
దీంతో ఆ మూడు కోట్ల రూపాయలు నష్టం వాటిలిందని అందుకే టాక్ షోలను నేను హోస్టుగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అంటూ మంచు లక్ష్మి తెలియజేయడం జరిగింది. దీంతో అనుష్క వల్ల మంచు లక్ష్మి అన్ని కోట్లు నష్టపోయిందా అంటూ పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. అందుకే అప్పటినుంచి మంచు లక్ష్మి ఎలాంటి షోలకైనా సరే హోస్టుగా వ్యవహరించలేదట. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.