శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం దసరా. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లేవలో విడుదల కావడం జరిగింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ జంటగా నటించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మొదటిసారి ఇలా కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున జరగడంతో ఓపెనింగ్ కూడా భారీ ఎత్తున వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాలో చమ్కీల అంగీలు వేసి ఓ వదిన అనే పాట అందరిని బాగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో ఇంకా ఈ వీడియో పైన పలు రకాలుగా రీల్స్ చేస్తూ ఉన్నారు . వ్యూసు పరంగా కూడా బాగానే రాబడుతోంది.తాజాగా ఈ సినిమా పాటకి మంచు లక్ష్మి డాన్స్ వేయడం జరిగింది. పింకు కలర్ లంగా వోని దుస్తులలో ట్రెడిషనల్ గా అదరగొట్టేస్తోంది మంచు లక్ష్మి. ఈమె వేసిన స్టెప్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ సమయంలో మంచు లక్ష్మి కూతురు కూడా మధ్యలో వచ్చి చిన్న చిన్న స్టెప్పులు వేయడం జరిగింది. కూతురుతో కలిసి మంచు లక్ష్మి దసరా సినిమాలోని చమ్కీల అంగీలు వేసి ఓ వదిన అనే పాటకి డాన్స్ వేయడంతో సోషల్ మీడియాలో తేగ వైరల్ గా మారుతోంది. ఇదే పాటకి హీరోయిన్ కీర్తి సురేష్ తల్లితో తన అల్లుడితో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.