ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా భారీ మొత్తంలో ప్రజలు నష్టాన్ని చవి చూశారు. ఈ మేరకు తన వంతు సహాయంగా సినీ ఇండస్ట్రీలోని ఉండే కొంతమంది ప్రముఖులు సహాయం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరదల నష్టపోయిన వారికి 25 లక్షల రూపాయలు అందించడం జరిగింది.
ఇక వీరితో పాటు ఆంధ్రప్రదేశ్లోని వరదల కారణంగా అనేకమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతోనే.. చిరంజీవి తన వంతు సహాయంగా 25 లక్షలు ప్రకటించారు. కానీ తన కుమారుడైన రామ్ చరణ్, చిరంజీవిల వంతు సహాయంగా ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి..50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతో మన తెలుగు హీరోలు వరద బాధితులకు అండగా ఉండేందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.