టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో మమత మోహన్ దాస్ కూడా ఒకరు.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ యమదొంగ, వెంకటేష్ చింతకాయలరవి , నాగార్జున కేడి వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. తన జీవితంలో రెండు సార్లు క్యాన్సర్ బారిన పడిన ధైర్యంగా క్యాన్సర్ ను జయించింది. ఇక మమతా మోహన్ దాస్ క్యాన్సర్ నుంచి తప్పించుకొని మరో సమస్య తో సతమతమవుతోంది. అదే వీటిలిగో అనే కొత్త వ్యాధితో బాధపడుతున్నదట.
ఇలా తాను ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న సమస్యల గురించి మమతా మోహన్ దాస్ బాధపడుతూ అభిమానులతో పంచుకున్నారు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే తన కెరీర్ చాలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సినీ కెరీర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా అనుష్క నటించిన అరుంధతి సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.
మొదట్లో అరుంధతి సినిమా అవకాశము మమతా మోహన్ దాస్ కే వచ్చిందట. అయితే తన మేనేజర్ ఆ సినిమా నిర్మాణ సంస్థ మంచిది కాదని తెలియజేయడంతో తాను ఈ సినిమాని నటించటానికి ఒప్పుకోలేదట. నాకోసం శ్యాంప్రసాద్ రెడ్డి గారు దాదాపు రెండు మూడు నెలలు వెయిట్ చేశారు. కానీ నేను ఈ సినిమా చేయనని చెప్పేశాను. యమదొంగ సినిమా చేస్తున్న టైంలో రాజమౌళి గారు నువ్వు అరుంధతి సినిమా ఎందుకు వదులుకున్నావు చాలా పెద్ద తప్పు చేశావు అని అన్నారు. అలా ఆయన అన్న మాటలకు నాకు గుండె పగిలేంత పని అయ్యింది. అప్పట్లో నాకు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తెలియక పోవడం వల్ల ఇలాంటి పెద్ద తప్పు చేశానని తెలియజేసింది.