హీరో అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తను నటించే సినిమాలు అన్నీ చాలా విభిన్నంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అలా ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం మేజర్. ఈ సినిమాకి డైరెక్టర్ గా శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతోంది.
ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ లు ఉంటాయి అని తాజాగా హీరో అడవి శేషు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో ఎపిక్ లవ్ స్టోరీ ఉందని, వీటి గురించి రాబోయే కొద్ది రోజుల్లోనే తెలుసుకోనున్నారు అంటూ చెప్పుకొచ్చారు శోభిత దూళిపాళ్ల. ఇక ఇందులో కూడా ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం చరణ్ పాకాల అందిస్తున్నారు. ఇక ఈ సినిమా పై అడవిశేషు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Isn’t it time for the world to know about an EPIC #Love in #MajorTheFilm ?
Lots to surprise you with in the next few days 🙂
— Adivi Sesh (@AdiviSesh) December 26, 2021