మేజర్ సినిమా నుంచి.. మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అడవి శేషు హీరోగా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించారు. అయితే మొదట సినీ ఇండస్ట్రీలోకి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి.. ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ తన స్టార్డమ్ను సంపాదించారు. ఇక ఈ రోజు అడవి శేషు పుట్టినరోజు సందర్భంగా.. అడవి శేషు నటిస్తున్న మేజర్ సినిమాకు సంబంధించి,మహేష్ బాబు ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.

శశికిరణ్ తిక్క దర్శకుడు ఈ సినిమాకి దర్శకుడు గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాత గా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నది. ఈరోజు అడవి శేషు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో అడవి శేషు సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇక మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళ నటించనుంది.ఇక ముఖ్యమైన పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పాత్రలో రేవతి నటిస్తున్నట్లు సమాచారం.

Share.