వైర‌ల్‌గా మారిన ప్రిన్స్ ట్విట్ ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారి భారీ ట్రెండింగ్ అవుతున్నాయి.. ఇంత‌కు ఈ ఫోటోలు ఎక్క‌డ దిగిన‌వి అనుకుంటున్నారు.. అవి ఆకాశంలో 42వేల అడుగుల ఎత్తులో దిగిన ఫోటోలు. ఏంటీ ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఏందీ అంత ఎత్తులో ఆకాశంలో ఫోటోలు దిగ‌డం ఏంటి అనుకుంటున్నారా.. ఒక్క మ‌హేష్‌బాబే కాదండి.. ప్రిన్స్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, ఆయ‌న కొడుకు, కూతురు కూడా అంత ఎత్తులోనే ఫోటోల‌కు ఫోజు ఇచ్చారు..

ఇంత‌కు అంత ఎత్తులో వారికేం ప‌ని అనుకుంటున్నారు క‌దా. అదేమి లేదు. ఆకాశంలో వారికి ఏమీ ప‌ని ఉంటుంది.. ప్రిన్స్ మ‌హేష్‌బాబు ద‌స‌రా సెల‌వుల‌కు విదేశాల‌కు వెళ్ళ‌న సంద‌ర్భంగా విమానంలో విహ‌రిస్తుండ‌గా విమానంలో తీసుకున్న ఫోటోలవి. ఓ అంటే విమానంలో దిగిన ఫోటోల‌ను ప్రిన్స్ మ‌హేష్‌బాబు త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు ఈ ఫోటోల‌కు క్యాప్ష‌న్ కూడా చేర్చారు. 42వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణం బాగుంది అని కామెంట్ పెట్టాడు. అయితే త‌న భార్య‌, కొడుకుతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమాలో మ‌హేష్‌బాబు న‌టిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది. ద‌స‌రా సెల‌వుల‌కు కుటుంబంతో క‌లిసి స్విట్జ‌ర్లాండ్‌కు వెళ్ళారు.

Share.