మహేష్ బాబు తన అభిమానుల కోరిక తీరుస్తారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో జోరుమీదున్న విషయం తెలిసిందే.. ఇక తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ హీరోగా ఆయన కెరియర్ కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు ఇతర భాషా చిత్రాల్లో నటించడం లేదని చెప్పవచ్చు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. చరణ్, ఎన్టీఆర్ లు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పాన్ ఇండియా మూవీ కాదు అని వార్తలు వస్తున్నాయి.

Wow! Triple Dhamaka for Mahesh Babu fans

ఇంకోవైపు మహేష్ , త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీ అని కన్ఫర్మ్ అయినప్పటికీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో క్లారిటీ లేదు.. అందుకే ఆయన అభిమానులు బాలీవుడ్ పై దృష్టి పెట్టాలని సూపర్ స్టార్ ను కోరుకుంటున్నారు. అక్కడ సక్సెస్ అయితే మహేష్ బాబు మార్కెట్ ఊహించిన స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంది.. అందుకే హీరోగా మహేష్ క్రేజ్ ను సంపాదించుకుంటే చూడాలని ఉందని ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నట్లుగా.. వారి కోరికను తీరుస్తాడో లేదో వేచి చూడాలి..

Share.