మ‌హేష్ కొంచెం మార‌వా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రిన్స్ మ‌హేష్‌బాబు పై ఇప్పుడు నెటిజ‌న్లు విరుచుకు పడుతున్నారు. ఎంత‌కాలం మ‌మ్మిల్ని ఇదే లుక్క‌తో చంపుతావు అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అస‌లు ప్రిన్స్ మ‌హేష్‌బాబుపై నెటిజ‌న్లు ఎందుకు ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా.. ఏ విష‌యంలో ట్రోలింగ్ అనుకుంటున్నారా.. అయితే ఓసారి లుక్కేద్దాం..

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపుగా సినిమా షూటింగ్ అయిపోయింది. వచ్చే ఏడాది సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతోంది. నిన్న విజయదశమి సందర్భంగా సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో మహేష్ ఆర్మీ డ్రెస్ లో కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర కత్తి పట్టుకుని చాలా కోపంగా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోలింగ్ అంటే సాధాసీదా ట్రోలింగ్ కాదు..

మహేష్ గత సినిమాలకి సంబంధించిన పోస్టర్ లను పక్కన పెడుతూ దీనిని పోలుస్తున్నారు. మహేష్ జస్ట్ డ్రెస్ లు మాత్రమే మారుస్తున్నాడు.. కానీ, స్టిల్స్ అవేనని కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ కొంచం మారవా? ప్లీజ్.. అని అంటున్నారు. మహేష్ పై ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. ఖలేజా సినిమాకి ముందు మహేష్ డైలాగ్స్ చెబితే ఎవరికి అర్ధం కాదని ట్రోలింగ్ చేసారు. అ తర్వాత మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఆ సినిమాలో తన కామెడి యాంగిల్ ని చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ఈ ట్రోలింగ్‌తో కూడా మ‌హేష్ మంచి మార్కులే కొట్ట‌నున్నాడ‌ని ఆయ‌న అభిమానులు సంతోష‌ప‌డుతున్నారు..

Share.