పూరిని మరిచాడు.. సుకుమార్ కు పంచ్ వేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబోలో మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. మహేష్ 25వ సినిమా కాబట్టి తను ఇంతకుముందు చేసిన సినిమా దర్శకుల పేర్లను ప్రస్థావించాడు మహేష్. అయితే అందులో తనకు పోకిరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ పూరి జగన్నాథ్ పేరు మర్చిపోయాడు మహేష్.

రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, త్రివిక్రం, శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి ఇలా అందరి పేర్లు చెప్పి పూరి పేరు మర్చిపోయాడు. అయితే ఈవెంట్ తర్వాత ఇంటికెల్లి ఆలోచించుకుని తనని సూపర్ స్టార్ చేసిన పోకిరి సినిమా మర్చిపోయాను. పూరి జగన్నాథ్ కు థ్యాంక్స్ అని చెప్పాడు. అయితే మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన పోకిరిని మర్చిపోవడం ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

ఇక ఇదే వేదికపై వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుతూ ఓ పది నిమిషాలు కథ విని పంపిచ్చేద్దాం అనుకున్నా కాని సినిమా కథ విని నచ్చి రెండేళ్లు వెయిట్ చేస్తావా అని అడిగాను.. అప్పుడు వంశీ ఈ కథలో మిమ్మల్ని మాత్రమే ఊహించగలను అంటూ రెండేళ్లు వెయిట్ చేశాడు. ఇంకో డైరక్టర్ అయితే తాను వెయిట్ చేయమని చెప్పగానే వేరే హీరో దగ్గరకు వెళ్తాడని పంచ్ వేశాడు. ఈ పంచ్ మాత్రం సుకుమార్ కే అని అందరు అంటున్నారు. ఈమధ్య సుకుమార్ తో మహేష్ సినిమా చేయాల్సి ఉన్నా అది క్యాన్సిల్ అయ్యింది. అందుకే సుకుమార్ పై మహేష్ ఇన్ డైరెక్ట్ పంచ్ వేశాడని తెలుస్తుంది.

Share.