సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమాతో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ అదిరిపోయే కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కు బంపర్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం కూడా విదితమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ బయటకు వచ్చింది.
బాలీవుడ్‌లో హౌజ్‌ఫుల్ 4 సినిమాలో నటించేందుకు ముంబైలో మకాం వేసిన పూజా ఎట్టకేలకు మహర్షిని ప్రేమలో పడేసేందుకు తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టిందట. ప్రత్యేకంగా వేసిన ఒక విలేజ్ సెట్‌లో వీరిద్దరి మధ్య కొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేయనున్నారు. వీరితోపాటు పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ షూట్‌లో పాల్గొంటారు.
వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే డెహ్రాడూన్ మరియు అమెరికాలో జరుపుకుంది. 2019 ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.