ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన సినిమా మహర్షి. దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇటీవల విడుదలైన ఈ సినిమా కనివిని ఎరుగని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అన్ని దియోటర్లలో మహర్షి సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబడుతూ తెలుగు చిత్రసీమలో మరో భారీ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతుంది.
అటు దర్శకుడు వంశీ పైడిపల్లి కేరీర్‌కు ఈ సినిమా ఓ విజయవంతమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఇటు మహేష్ బాబు కేరీర్ ప్రమాదంలో ఉన్న తరుణంలో ఓ మరుపురాని సినిమాగా మిగిలిపోనున్నది. మహేష్ బాబుకు కేరీర్లో ఇది 25వ చిత్రంగా వచ్చింది. ఇది హీరో మహేష్‌కు ఓ మైలురాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా విజయవంతం కావడం, భారీ వసూళ్ళు రాబడుతుండటంతో మహేష్‌బాబు ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.
కేరీర్ మైలురాయి చిత్రం అంటే ఏవరికైనా ఓ తీపి గుర్తుగా నిలిచిపోతుంది. ఈ మహర్షి సినిమా కూడా మహేష్ బాబు కేరీర్లో ఓ తీపి గుర్తునే ఇచ్చింది. భారీ వసూళ్ళు రాబడుతూ మహేష్ బాబుకు మంచి మైలేజ్ ఇస్తుండటంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. సినిమా విజయవంతం అయిన నేపధ్యంలో హైదరాబాద్ నోవాటెల్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు దర్శకుడు వంశీకి ముద్దులు ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ ముద్దులతో షాకైన వంశీ నా బెస్ట్ మూమెంట్.. ఇంతకు మించి ఇంకేం కోరుకోను అని ఆనందం వ్యక్తం చేశాడు. అంతే కాదు మహేష్ బాబు వంశీకి ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈముద్దుల సీనును చూసిన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
#Maharshi.. My Best moment.. Can't ask for more… 🙂@urstrulyMahesh pic.twitter.com/kNBBKkBkUA
— Vamshi Paidipally (@directorvamshi) May 12, 2019