అలాంటి పని చేయని ఏకైక హీరో మహేష్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో రీమిక్స్ సినిమాలను చాలామంది హీరోలు చేయడం కామన్ విషయం ..అలాగే టాలీవుడ్ లో కూడా చిరంజీవి, పవన్ , ప్రభాస్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది హీరోలు రీమిక్స్ సినిమాలు చేస్తున్నారు. అయితే అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి.. మరికొన్ని సినిమాలు డిజార్డర్ గా మిగిలాయి..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక హీరో మాత్రం ఒక రీమిక్స్ సినిమా కూడా చేయలేదు. అలా అని కొత్త హీరో అనుకుంటే పొరపాటే ఆ హీరో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు అవుతోంది.. అయినా కూడా ఇప్పటివరకు ఒక్క రీమిక్స్ సినిమా కూడా నటించలేదు.. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు

Mahesh Babu's emotional note to fans on Mosagallaku Mosagadu re-release -  Telugu News - IndiaGlitz.com

ఈయన హీరోగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు.. కానీ రీమిక్స్ సినిమాలు మాత్రం చేయటం లేదు.. దాని వెనుక ఒక కారణం ఉంది. అదేంటన్నది చాలామందికి తెలియదు. మహేష్ బాబు రీమిక్స్ సినిమాలు చేయకపోవటానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదట రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో పొజిషన్ కి ఎదిగాడు.. ఇకపోతే రీమిక్స్ సినిమా చేయకపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయానికి వస్తే.. ఏదైనా సినిమా చూసి తరువాత.. ఆ సినిమా రీమిక్స్ చేయాలని అనుకొని సెట్ పైకి వెళ్తే అందులో ఆ హీరోనే కనిపిస్తాడు.. అంతేకాదు ఆ హీరోలా చేయాలా లేదా మనలా మనం యాక్టింగ్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో పడిపోతాను..అందుకే చాలా వరకు రీమిక్స్ సినిమాలకు దూరంగా ఉంటానని మహేష్ బాబు తెలిపారు.

అయితే తను రీమిక్స్ సినిమాలు చెయ్యను కానీ నా సినిమాలను మాత్రం రీమిక్స్ చేయాలని అనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share.