సూపర్ స్టార్ మహేష్, ఏసియన్ సినిమాస్ సునీల్ కలిసి భారీ మెల్టీప్లెక్స్ ఒకటి నిర్మించారు. ఏ.ఎం.బి సినిమాస్ పేరుతో హైదరబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్ ఉంది. ఆదివారం ఈ మెగా మల్టీప్లెక్స్ ఓపెనింగ్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదగా ఈ థియేటర్ ఓపెన్ చేశారు. 7 స్క్రీన్స్ ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న మిగతా మల్టీప్లెక్స్ అన్నిటికన్నా ఇది ఇంకా అధునాతన టెక్నికల్ అప్డేట్స్ తో సిద్ధం చేయబడింది. 360 డిగ్రీస్ మూవీ ఎక్స్ పీరియన్స్ తో ఈ మల్టీప్లెక్స్ సిద్ధం చేశారు.
ఇక ఈ మల్టీప్లెక్స్ లో స్క్రీన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. 60000 చదపు అడుగుల మాల్ ఓ ఇంద్రభవనంలా ఈ మల్టీప్లెక్స్ ఉండటం విశేషం. మిగతా స్టార్ అంతా వేరే బిజినెస్ లు చేస్తుంటే మహేష్ మాత్రం ఏకంగా మల్టీప్లెక్స్ లోకి వచ్చేశాడు. ఏసియన్ సునీల్ తో మహేష్ ఇంకా తిరుపతి, అమరావతి, విజయవాడ, వైజాగ్ లలో కూడా ఈ మల్టీప్లెక్స్ లను నిర్మించాలని చూస్తున్నారట. హైదరాబాద్ లో ఐకియాను తలదన్నేలా ఈ మల్టీప్లెక్స్ ఉండటం విశేషం. ఇదే కాదు మరో మెగా మల్టీప్లెక్స్ కూడా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట.
అంతా సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఉండే ఏరియా కాబట్టి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ కు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. 200 రూపాయల టికెట్ ప్రైజ్ తో ఈ మల్టీప్లెక్స్ లో సినిమా చూడొచ్చు. రిక్లెయినర్ సీట్స్ లో మసాజ్ ఫెసిలిటీ కూడా ఉందని తెలుస్తుంది. అయితే దానికి అదనపు ఛార్జ్ ఉండే అవకాశం ఉందట. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ కావాలనుకునే వారు ఈ ఏ.ఎం.బి సినిమాస్ లో ఒకసారి సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ థియేటర్ లో 2.ఓ రిలీజ్ అయినట్టు తెలుస్తుంది.