మహేష్ ప్లాన్ తో స్టార్ హీరోలకు షాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత మహేష్ ఎలాంటి లేట్ లేకుండా వరుస సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. అనీల్ రావిపుడితో సరిలేరు నీకెవ్వరు చేస్తూనే అతని వర్కింగ్ స్టైల్ నచ్చి అతనితో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు మహేష్. ఆల్రెడీ అనీల్ ఒక లైన్ చెప్పగా డెవలప్ చేయమని చెప్పాడట. ఇక ఇదిలాఉంటే రాజమౌళితో మహేష్ సినిమా కూడా ఈసారి పక్కా అని అంటున్నారు.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఆ సినిమా తర్వాత మహేష్ తోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండేళ్లు డేట్స్ ఇవ్వాల్సిందే. అందుకే సాధ్యమైనంత వరకు సినిమాలు చేసేలా ఉన్నాడు మహేష్. అనీల్ రావిపుడితో సినిమా పూర్తి కాగానే వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా మహేష్ ఓ మూవీ చేస్తాడని లేటెస్ట్ టాక్.

అసలైతే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. కాని తారక్ బదులుగా మహేష్ ప్రశాంత్ నీల్ తో చేస్తాడని లేటెస్ట్ టాక్. మొత్తానికి మహేష్ మాత్రం రాజమౌళి సినిమా కన్నా ముందు రెండు బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేయాలని కసి మీద ఉన్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు సంవత్సరానికి ఒక సినిమా ఇచ్చే మహేష్ ఇక మీదట రెండు సినిమాలు చేస్తాడని అంటున్నారు.

Share.