టాలీవుడ్ లో అమ్మాయిల రాకుమారుడు గా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నటువంటి నటుడు మహేష్ బాబు ఈయన చిన్నతనం నుంచే నటనలో లీనమైపోయాడు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఈ మధ్యనే ఒక సినిమాను కూడా ప్రారంభించారు..అదే గుంటూరు కారం ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబుకి ఇది మూడవ సినిమా.. అందుకనే ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇది కాస్త పక్కన పెడితే మహేష్ బాబు సినీ కెరీర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మాట్లాడాల్సిన సినిమా పోకిరి..ఈ సినిమా మహేష్ బాబు కెరీర్నే టర్నింగ్ చేసింది. అప్పటివరకు మహేష్ బాబు కెరీర్ లో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రానే రాలేదు. ఈ సినిమా మహేష్ బాబుకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో చెప్పాల్సిన పని లేదు..అయితే ఈ సినిమాలో చేసినందుకు మహేష్ బాబుకి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా మరోవైపు తీవ్రమైనటువంటి నష్టాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.
ఒకానొక సమయంలో మహేష్ బాబు పోకిరి సినిమాలో ఎందుకు నటించానా అని బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట. ఈ సినిమా చేసిన తర్వాత ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించింది కాబట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.అయితే మహేష్ బాబు అభిమానులు పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావాలని ఊహించుకున్నారు.. కానీ ఎన్ని సినిమాలు వచ్చినా అంతటి స్థాయి మాత్రం రావటం లేదు.దాంతో మహేష్ బాబు పోకిరి సినిమా ఎందుకు నటించానని మదనపడ్డాడట.