టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా మహేష్, నమ్రత వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు నమ్రతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా ఎదుగుదలకు నమ్రత ఎంతో సహాయం చేస్తోందని మహేష్ తన భార్య గురించి పొగడ్తల వర్షాన్ని కురిపించారు. నా భార్య నాకు వెన్నంటే ఉంటుంది. అలాగే ఘట్టమనేని కోడలిగా ఒకవైపు నా బిజినెస్ లను అలాగే నా కుటుంబాన్ని చూసుకుంటుంది.
ఇక మహేష్ బాబు, నమ్రత వివాహం 2005 ఫిబ్రవరి 10వ తేదీన వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జోడి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న కుటుంబానికి కూడా మహేష్ ఎంతగానో ప్రాధాన్యత ఇస్తాడు. రీసెంట్గా మహేష్ బాబు త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ కోసం షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ ఆరు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని షరతు విధించారని సమాచారం.
నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ చేసిన ఈ ట్వీట్ కేవలం రెండు గంటల్లోనే 30,000 కంటే ఎక్కువ మొత్తం లైక్స్ రావటం గమనార్హం. మహేష్ ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేస్తాడు. అలాగే గతంలో బిజినెస్ మ్యాన్ సినిమా షూటింగ్ కూడా మహేష్ ఇదే విధంగా వేగంగా పూర్తి చేశారట. మహేష్ తో పాటు నమ్రుత కూడా సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక నెరవేరడం చాలా కష్టమే.. ఈ జంట ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే వీరిద్దరినీ స్వీట్ కపుల్ అని కూడా అంటారు. ఇక వీరి ఫ్యామిలీ మొత్తం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. ఇక ఆమె బర్త్డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Happy birthday NSG! Thank you for putting things in perspective… for lifting me up and for being you always! ❤️❤️❤️ pic.twitter.com/KBBD3x5bXV
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2023