మహేష్.. ఏది ఫేక్.. ఏది రియల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో మహేష్ ఒకడు. స్టార్ సినిమా అంటే మూస ఫార్ములాలో వెళ్లాలన్న విధానాన్ని మార్చి సినిమా సినిమాకు కొత్త ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు మహేష్.

అయితే మహేష్ ఇప్పుడు ఓ క్రేజీ రికార్డ్ అందుకున్నాడు. ట్విట్టర్ లో అతనికి 7 మిలియన్ ఫాలోవర్స్ రావడం విశేషం. అంటే అక్షరాల 70 లక్షల మంది మహేష్ ను ఫాలో అవుతున్నారన్నమాట. అయితే ట్విట్టర్ ఫాలోవర్స్ లో ఫేక్ లెక్కలు తెలిసిందే. ఈమధ్యనే అవి బయట పడ్డాయి. అయితే మహేష్ 7 మిలియన్ ఫాలోవర్స్ లో ఎంతవరకు నిజం ఉంది అన్నది కొందరి వాదన.

మహేష్ ప్రతి అప్డేట్ షేర్ చేసుకునే ట్విట్టర్ లో క్రేజీ ఫాలోవర్స్ ఉండటం విశేషం. టాలీవుడ్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా మహేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. సౌత్ సిని పరిశ్రమలో కూడా మహేష్ తన ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నాడు.

Share.