ప్రస్తుతం బుల్లితెర పై బిగ్ బాస్ తో పాటుగా, ఎవరు మీలో కోటీశ్వరులు రియాల్టీ షోలు ప్రసారం అవుతున్నాయి. బిగ్ బాస్ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండూ రియాలిటీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇకపోతే ఎవరు మీలో కోటీశ్వరులు షో విషయానికి వస్తే.. హోస్ట్ గా ఎన్టీఆర్ తనదైన శైలిలో అలరిస్తున్నాడు.
ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరులు షోకి పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి చేయగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ షోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి ఎవరు మీలో కోటీశ్వరుడు స్టేజ్ పై సందడి చేశారు. మహేష్ బాబు అతిథిగా వచ్చిన ఈ ప్రోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోను షో మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఇద్దరు హీరోలను ఒకే స్టేజిపై చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.