లెట్స్ డ్యూ ఇట్ అంటున్న మహేష్.. ఎందుకంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. ఈయన తనదైన శైలిలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో మహేష్ బాబు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.ఈ మిల్కీ బాయ్ తన స్టైల్ తో ఎంతో మంది అమ్మాయిల మనసులు దోచుకున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అలాగే సినిమా జయ అపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మహేష్ బాబు థమ్సప్,అభి బస్,ఐడియా,సంతూర్,ప్యారగాన్ లాంటి వాణిజ్య ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా శీతల పానీయం అయినా మౌంటైన్ డ్యూ ఇండియాకు కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు మహేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్నీ ట్విట్టర్లో లెట్స్ డూ ఇట్ అంటూ పోస్ట్ చేశారు.

Share.