గతంతో పోలిస్తే ఈ మధ్య హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం అనేది పెరిగింది. ఇతర హీరోల అభిమానులను తమ వైపుకి తిప్పుకోవడానికి ఒకరి కార్యక్రమాలకు మరొకరు వెళ్ళడం అనేది మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కుటుంబం, ప్రభాస్ ఇలా చాలా మంది ఇతర హీరోలతో సినిమాల కార్యక్రమలకు హాజరు కావడం మనం చూస్తున్నాం. వచ్చే నెల మొదటి వారంలో జరిగే మహేష్ సినిమా కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి హాజరవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు హీరోలు ఒక అడుగు ముందుకి వేస్తున్నారు. ఇతర హీరోల సినిమాలను నిర్మించాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ అదే చేస్తున్నారట. కొన్నాళ్ళ నుంచి సినిమా నిర్మాణాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన మహేష్ బాబు, ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్దమయ్యాడట. అల్లు అరవింద్, దిల్ రాజు తో కలిసి అల్లు అర్జున్ సినిమాను నిర్మించాలని మహేష్ భావిస్తున్నట్టు సమాచార౦. ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ సినిమాల మీద దృష్టి పెట్టారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతాయని, నమ్రత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం టాలివుడ్ లో ఒకరకంగా సంచలనమే అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సాహసాలు చేయడానికి ఏ హీరో ముందుకి రాలేదు. ట్రెండ్ సెట్ చెయ్యాడానికి ప్రయత్నాలు చేస్తున్న మహేష్ బాబు ఇప్పటికే నిర్మాతగా తాను ఏంటో చూపించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా సినిమా చేస్తే మాత్రం అది ఒక సంచలనంగా చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు.