టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబెనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో చిన్నతనం నుంచి తన తండ్రితో కొన్ని సినిమాలను చేసి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు .ఈ హీరో సినిమాల కోసం అమ్మాయిలు థియేటర్ల ముందు క్యూ కడుతుంటారు.మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఇక అభిమానులకు పండగే.. అయితే ఈమధ్య చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిపోతున్నారు. వారు తీసే సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో అన్ని చోట్లకు విస్తరిస్తున్నాయి. అయితే మహేష్ బాబు సినిమాలు మాత్రం రెండు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి.

From Prabhas to Allu Arjun, 5 Tollywood actors with huge craze in North  India | The Times of India

చాలామంది పాన్ ఇండియా హీరోలు రూ .100 కోట్ల రెమ్యూన రేషన్ తీసుకుంటున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే తన సినిమాను పరిమితం చేసి అలాగే పాన్ ఇండియా హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. దాదాపు మహేష్ బాబు రూ .70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరు కారం సినిమాకు కూడా భారీగానే తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయటం లేదు..ఇరు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యేలా తీస్తున్నారు. కానీ ఈ సినిమాకి మహేష్ బాబు రెమ్యునరేషన్ రూ .70 కోట్ల రూపాయలను పుచ్చుకుంటున్నాడట. ఈ రెమ్యునరేషన్ చూస్తుంటే మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడని అర్థం అవుతోంది. ఈయన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్లకపోయినా టాలీవుడ్ లో మాత్రం టాప్ పొజిషన్లో ఉన్నాడు.రెమ్యూనరేషన్ విషయానికి వస్తే పాన్ ఇండియా హీరోల కంటే తక్కువ ఏమీ పుచ్చుకోవటం లేదు. అంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఈ విషయాన్ని పట్టి చూస్తే.. మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర హీరో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా టాలీవుడ్ అగ్ర హీరోలలో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నారు.

Share.