డైరెక్టర్ రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి విలన్ లఎంపిక ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతోంది అన్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించి కొంత మంది హీరోలను కూడా పరిశీలించడం జరిగిందట. అందులో హీరో విక్రమ్ విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం రాజమౌళి ఆయన చిత్ర యూనిట్ సభ్యులు, అంతా కలిసి ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు గా సమాచారం. ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్ మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రాసినట్లు సమాచారం. ఈ సినిమా అంతా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా సాగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు రాజమౌళి, నేను పెద్ద అభిమానులమని తెలియజేశాడు. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నానని తెలియజేశాడు.