హీరో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు చిత్రయూనిట్ సన్నద్దమైంది. మహేష్‌బాబు కేరీర్‌లో 25వ చిత్రంలో నటించగా, ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. సినిమా విడుదలై రెండోవారం అవుతున్నా కలెక్షన్లు కోల్లగొడుతూనే ఉంది. మహర్షి సాధించిన విజయంతో ఖుషిగా ఉన్న మహేష్‌బాబు సక్సెస్ మీట్‌ను తన సిని జీవితంలో గుర్తుండి పోయేలా నిర్వహించాలని ప్లాన్ చేశారట. అందుకు సర్వం సిద్దం చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.
మహర్షీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.59కోట్లకు, ప్రపంచ వ్యాప్తంగా 75కోట్ల పైగా షేర్‌ను రాబట్టింది. ఇది నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టినట్టే. ఈ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా విజయోత్సవ సభను విజయవాడలో నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సిద్దార్థ్ ఇనిస్టిట్యూట్ ఆప్ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్ వేదికగా నిర్ణయించారు. ఈనెల 18న అంటే శనివారం రోజున సాయంత్రం 6గంటలకు ఈ విజయోత్సవ సభను ప్రారంభిస్తున్నట్లు, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయోత్సవ సంభరాల్లో మహర్షి సినిమా లో నటించిన తారగణం, తెరవెనుక శ్రమించిన టెక్నికల్ టీం అంతా హాజరుకానున్నారు. మహేష్ బాబు నటించిన 25వ చిత్రం కావడంతో ఈ విజయోత్సవ సభకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మహేష్‌బాబుతో పాటు కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్, హీరోయిన్ పూజా హెగ్డే, అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, ముఖేష్‌రుషి, ప్రకాశ్‌రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ, నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్, పివిపితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు.