ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ టాక్ బాగున్నా పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. ఇక రీసెంట్ గా లాస్ట్ ఫ్రై డే ఎన్.టి.ఆర్ మహానాయకుడు సెకండ్ పార్ట్ రిలీజైంది. ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానం చూపిస్తూ ఈ సినిమా వచ్చింది. అయితే సినిమా అసంపూర్తిగా ఉందని ప్రేక్షకులు ఈ సినిమా చూసి పెదవి విరిచారు. ఇదిలాఉంటే ఈ సినిమా వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి.
కథానాయకుడు సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ తో కాస్త పర్వాలేదు అన్నట్టుగా మొదటి రోజు వసూళ్లు వచ్చాయి. మహానాయకుడు కోటిన్నర మాత్రమే రాబట్టింది. ఇక 3 రోజుల్లో మహానాయకుడు మూడున్నర కోట్లు మాత్రం వసూళు చేసింది. గొప్ప నటుడు, మహానాయకుడు అయిన ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర గురించి తీసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ నందమూరి అభిమానులకు చేదు జ్ఞాపకంగా మిగిలిందని చెప్పొచ్చు.
ఏరియాల వారిగా ఎన్.టి.ఆర్ మహానాయకుడు 3డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం : 0.63 కోట్లు
సీడెడ్ : 0.29 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.27 కోట్లు
కృష్ణ : 0.30 కోట్లు
గుంటూరు : 0.61 కోట్లు
ఈస్ట్ : 0.18 కోట్లు
వెస్ట్: 0.16 కోట్లు
నెల్లూరు : 0.11 కోట్లు
ఏపీ/తెలంగాణా : రూ. 2.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.24 కోట్లు
ఓవర్సీస్ : 0.61 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : రూ. 3.40 కోట్లు