మహానటి ఆస్తులు పోవడానికి ఆ సినిమానే కారణమా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మహానటి సావిత్రి.. దేశ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా చెలామణి అవుతూనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతే కాదు దాదాపు 40 సంవత్సరాలు ముగిసినా కూడా సావిత్రి పేరు ఇంకా మారుమ్రోగుతోంది అంటే ఆమె ఎంతటి గొప్ప నటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సావిత్రి సినిమాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలను సంపాదించింది అని సమాచారం.

Chinnari Papalu - Wikipedia

సంపాదించిన డబ్బునంతా దానధర్మాలు చేస్తూ.. ఎంతో మందికి అన్నపూర్ణగా నిలిచింది. ఇకపోతే సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకొని, ఆస్తి పరంగా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆమె దర్శకురాలిగా మారి నిర్మాతలతో కలిసి ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నదట. ఆ సినిమానే చిన్నారి పాపలు.ఈ సినిమా కు దర్శకత్వం ఆమె, నిర్మాతగా కూడా ఆమెనే వ్యవహరించింది. అయితే వాటాదారులు మధ్యలోనే చేతులెత్తేసి మోసగించి ఆమె ఆస్తి రాయించుకోవడం తో.. ఏం చేయాలో తెలియక తన ఉన్న ఆస్తులను కూడా సినిమా పూర్తి చేయడం కోసం అమ్ముకున్నదట. అలా నమ్మిన వారే మోసం చేయడం తో చివరికి ఈమె అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది.

Share.