‘మా’ కు శాశ్వత భవనంపై సంచలన కామెంట్స్ చేసిన బండ్ల గణేష్…?

Google+ Pinterest LinkedIn Tumblr +

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయనే చెప్పొచ్చు. ఈ ‘మా’ ఎన్నికల విషయమై రోజుకో అంశం తెరమీదకు తెస్తు పలువురు ఎన్నికల వాతావరణాన్ని ఇంకా వేడెక్కిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ‘మా’ ఎన్నికలు, భవన నిర్మాణంపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ‘మా’కు శాశ్వత భవనం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘మా’లో ఉన్న 900 మందిలో చాలా మంది పేదవారు ఉన్నారని చెప్పారు. బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించాలని బండ్ల కోరారు.

‘మా’ కి బిల్డింగ్‌ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదని, సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోవని, సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరని బండ్ల పేర్కొన్నారు. మా అధ్యక్ష పదవీకి ఈ సారి చాలా మందే పోటీ చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ‌తో పాటు సీవీఎల్‌ నరసింహారావు పోటీలో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ‘సినిమా బిడ్డలు’ పేరుతో తన ప్యానెల్‌ను పరిచయం చేశారు. ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్, మెగా బ్రదర్ నాగబాబు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలిపిన సంగతి అందరికీ విదితమే.

Share.