ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ అగ్ర నిర్మాత లలో ఒకరు అని చెప్పవచ్చు. ఈయన నిర్మాత మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా తనదైన మార్క్ ను క్రియేట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఎదిగిన తీరు చాలా మందికి ఆదర్శం అని చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో చేసే ప్రతి సినిమాలో కూడా ఇన్వాల్వ్ అవుతూ కథ-స్క్రీన్ప్లే, నటీనటుల ఎంపిక ఇలా అన్నింటిలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఆయన సక్సెస్ రేటు కూడా ఎక్కువనే చెప్పాలి.
ఇక ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు. గతంలో నాగచైతన్య హీరోగా రూపొందించిన జోష్ సినిమా లో డైరెక్టర్ వాసువర్మ రిక్వెస్ట్ మేరకు దిల్ రాజు ఒక పాట కూడా పాడారు. అయితే అది కేవలం వెండితెర కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం ఈయన స్టేజి పైన పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అదికూడా ఒక లవ్ సాంగ్. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ లో ఒక ప్రైవేటు కార్యక్రమానికి దిల్ రాజు సతీసమేతంగా హాజరయ్యారు . అది ఒక హోటల్ ఓపెనింగ్. నిర్వాహకులు ఈవెంట్ ను ఘనంగానే జరిపారు. మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఇకపోతే ఈ స్టేజి పైన ..నాగార్జున ఆయన సతీమణి అమల తో కలిసి నటించిన చిత్రం నిర్ణయం..ఈ చిత్రంలో ” హలో గురు ప్రేమ కోసమేరా.. ఈ జీవితం..” అనే సాంగ్ పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంభందించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening 😉 pic.twitter.com/pgpTFZpFij
— Milagro Movies (@MilagroMovies) December 12, 2021