బిగ్ బాస్ లో ఆ ఇద్దరి సీక్రెట్ రొమాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ లో మూడో రోజు హౌజ్ లో అదిరిపోయే ట్విస్టులతో వాతావరణం వేడెక్కింది. ఓ వైపు బిగ్ బాస్ మొత్తం ఆరుగురిని ఈ వారం ఎలిమినేషన్కు నామినేట్ చేస్తే మరోవైపు ఎమోషన్స్, రొమాన్స్ తో షో అదిరిపోయింది. నామినేషన్లు రిప్లేస్ జరుగుతున్న టైంలో మానిటర్ హిమజకు శ్రీముఖికి మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరకు హేమ శ్రీముఖిని సేఫ్ చేయడంతో హిమజ కన్నీళ్లు పెట్టుకుంది.

ఓ వైపు ఇంత రచ్చ జరుగుతుంటే హౌజ్ లో మరోపక్క వరుణ్, వితికాల రొమాన్స్ కూడా ఆకట్టుకుంది. వరుణ్ సందేశ్… ఆయన భార్య వితికాతో అవకాశం దొరికినప్పుడల్లా సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటున్నారు. వీరిద్దరు పక్క పక్కనే కూర్చొని ముద్దుముద్దుగా మాట్లాడిన సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్కడ ఇంకెవ్వరు లేకపోవడంతో దొరికిందే అదనుగా వీరిద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. ఇంతలోనే వితిక కెమేరా మనవైపే చూస్తుందని వెంటనే రొమాన్స్ కు పుల్ స్టాప్ పెట్టేసింది.

Share.