కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమా థియేటర్లకు వస్తారు, కలెక్షన్లు బాగానే ఉంటాయి అని దర్శక నిర్మాతలు భావించారు. కానీ పలు సినిమాలు థియేటర్లలో, పలు సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతుండటంతో కొంతమంది ప్రేక్షకులు ఓటిటి కి పరిమితమవుతున్నారు. మరికొంతమంది థియేటర్లకు వస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ మొదటి వారంలో సందడి చేయనున్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం..
అఖండ : బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం అఖండ.ఇందులో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం : మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం.ఈ సినిమాను రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించరు.ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ మూవీలో అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
తడప్ : ఆర్‌ఎక్స్ 100 తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలోసిందే.ఈ సినిమాను తడప్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి తడప్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్‌గా కనిపించనుంది.ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది
బ్యాక్ డోర్ : పూర్ణ లీడ్ రోల్‌లో నటించిన మూవీ బ్యాక్ డోర్.ఈ బ్యాక్ డోర్ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ కానుంది.
స్కైలాబ్ : సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్.1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కానుంది.