టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోగా విజయ్ దేవరకొండ అ ఎంత పేరు సంపాదించారో మనకు తెలిసిన విషయమే. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్ ఈ సినిమా పానీ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హంగులతో విడుదల చేయడానికి ఈ సినిమా షూటింగ్ అన్న చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
మొట్టమొదటిసారిగా ఇండియన్ సినిమాల్లో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ నీ కూడా ఈ సినిమాతో తొలిసారిగా పరిచయం చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై ఒకేసారి మంచి హైప్ నెలకొని ఉంది. ఇక దీంతో ఈ సినిమా విడుదల పట్ల మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సరికొత్త డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర మేకర్స్.
వచ్చే ఏడాది ఆగస్టు 22న ఈ సినిమా విడుదల చేయడానికి కన్ఫామ్ చేశారు.. ఇక మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది