టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ జెనీలియా. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా కంటే హాసినిగా ముద్ర వేసుకుంది. బొమ్మరిల్లు సినిమాలో తన అల్లరితో తన అమాయకత్వంతో అభిమానులను ఆకట్టుకుంది. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఆ తరువాత ఢీ సినిమా కూడా సూపర్ హిట్ సక్సెస్ను అందుకోవటంతో జెనీలియా పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.
అయితే ఢీ తరువాత మళ్లీ అవకాశాలు రాలేదు. దాంతో హిందీలో ఓ సినిమాలో నటించింది. అయితే టాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఆమెకు సినిమా అవకాశాలు రాకపోవటానికి ప్రధాన కారణం జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ తో రిలేషన్ షిప్ లో ఉండటమే కారణమని చాలామంది హీరోలు ఆమెతో నటించలేదు. అయితే వీరి ప్రేమ విషయం చెప్పి ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించింది. జెనీలియ.. కానీ రితేష్ వాళ్ళ ఇంట్లో జెనీలియా ని కోడలిగా ఒప్పుకోలేదట.ఎందుకంటే ఆమె హీరోయిన్ అలాగే క్రిస్టియన్ కావడం వల్ల
అయినప్పటికీ రితేష్ పట్టుబట్టి వారి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చెప్పి నేనే మొత్తం చూసుకుంటాను అని అన్నారట. అయితే అదే సమయంలో మరో చిక్కు వచ్చి పడింది.. అదేంటంటే జెనీలియా గురించి బిటౌన్ లో ఒక వార్త చెక్కర్లు కొట్టింది. అదేంటంటే రితేష్ పెళ్లి పెట్టుకొని మరో స్టార్ హీరోని జెనీలియా సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అంటూ కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.. ఈ విషయం తెలియడంతో రితేష్ ఫ్యామిలీ పెళ్లి క్యాన్సిల్ చేశారు.
ఇంతకు నెట్టింట చెక్కర్లు కొట్టిన ఆ హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం.. ఈ వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫోర్స్ ఆ సినిమాలోని ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరూ సీక్రెట్ పెళ్లి చేసుకున్నారనే వార్తలు మరింత వైరల్ గా మారాయి.. అలా వచ్చిన వార్తల్లో ఎలాంటినిజం లేదని క్లారిటీ ఇచ్చి దాంతో జెనీలియా రితేష్ ల పెళ్లి జరిగిందట.