సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల విషయాల్లో ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి.. అందులో ఏవి నిజమో ఏవి అబద్ధమో తెలియటానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. వారి గురించి కొన్ని వివాదాలు వేరువేరు వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి.ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ,జయచిత్రను పెళ్లి చేసుకున్నాడని వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో పాటు తెగ వైరల్ కూడా అయ్యింది. ఈ వార్తలు జయచిత్ర వరకు వెళ్లడంతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయచిత్ర మాట్లాడుతూ వైరల్ అయిన వార్తలన్నీ నిజం కాదు..నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు వచ్చే వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చిత్ర చెప్పుకొచ్చింది. అలాంటి వార్తలకు నేను స్పందించాలని అనుకోవటం లేదు అంటూ కామెంట్స్ చేసింది..ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈయన వివాదాలకు దూరంగా బతికాడు.. ముఖ్యమంత్రిగా తను ఎన్నో గొప్ప గొప్ప పనులను చేసి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ముద్రను వేయించుకున్నాడు. వైయస్సార్ బతికున్నప్పుడు ఎలాంటి విమర్శలు చేయని వాళ్ళు ఆయన చనిపోయిన తరువాత ఇలాంటి విమర్శలు చేయటం కరెక్టేనా అంటూ వైఎస్సార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎలాంటి వ్యక్తో మనందరికీ తెలుసు అలాంటి వ్యక్తిపై ఇలాంటి నిందలు వేయటం కరెక్ట్ కాదు అంటూ వైయస్సార్ అభిమానులు వాపోతున్నారు.
జయచిత్ర విషయానికి వస్తే ఆమె అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న తరువాత మళ్లీ ఇప్పుడు కూడా భగవత్ కేసరి అనే సినిమాలో నటించబోతోంది.ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇక జయచిత్రకు తెలుగు ఇండస్ట్రీలో బోలెడన్ని అవకాశాలు వచ్చి బిజీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఆమె అభిమానులు భావిస్తున్నారు.జయచిత్ర చెప్పిన మాటలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ మారుతున్నాయి.