పోర్న్‌ పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేయాలంటున్న లేడీ డైరెక్టర్

Google+ Pinterest LinkedIn Tumblr +

పోర్న్ చిత్రాలని ఎక్కువ పురుషలే తీస్తారని, వారు పురుషలకు తగ్గట్టుగానే చిత్రీకరిస్తారని, అందుకే వాళ్ళు మహిళల అభిరుచులని ఏ మాత్రం పట్టించుకోరని ప్రముఖ పోర్న్ చిత్రాల దర్శకురాలు ఎరికా లస్ట్ అంటున్నారు. అసలు పోర్న్ ను పురుషలే కాదు, మహిళలు కూడా ఎంజాయ్ చేసేలా తీయాలని ఆమె చెబుతున్నారు. అందుకే ఇన్నాళ్ళు వచ్చిన పోర్న్ చిత్రాలకి భిన్నంగా తాను చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తునానని తెలిపారు.

మామూలుగా పోర్న్ హబ్ లో వీడియోల కోసం ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు 1000 మంది వెతుకుతున్నారని, అలా ఇంటర్నెట్ లో దొరికే వీడియోలు మహిళలని ఎక్కువ కించపరుస్తున్నట్లు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వావి వరుసలు లేకుండా కొన్ని వీడియోలు పెడతారని, అలాంటి వాటిని బ్యాన్ చేయాలని ఆమె కోరుతున్నారు. ఇక చాలా పోర్న్ వీడియోల్లో స్త్రీ, పురుషులు ఇద్దరు , సమానంగా సెక్సుని ఆస్వాదిస్తున్నట్లు ఉండవని, అందుకే తాను తీసే పోర్న్ చిత్రాల్లో ఇద్దరు ఒకే విధంగా ఆనందం పొందేలా చూపిస్తానని చెప్పారు.

అయితే ఎరికా తన పోర్న్ చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాని ఉపయోగిస్తారు. కానీ తన పోస్టులని సోషల్ మీడియా సంస్థలు షాడో బ్యాన్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పోస్టులతో పాటు, ఖాతా మీద కూడా ఇన్‌స్టాగ్రామ్ ‘షాడో బ్యాన్’ విధించిందని ఆమె అంటున్నారు. సాధారణంగా అశ్లీల సమాచారం ఉన్న పోస్టులు, ఖాతాలపై ‘షాడో బ్యాన్’ విధిస్తారు. ఈ షాడో బ్యాన్ వల్ల ఆ పోస్టులు ఫాలోవర్లకు మాత్రమే కనిపిస్తాయి, ఇతరులకు కనిపించవు.

అటు ఎరికాకు ది హాట్‌ బెడ్ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యాత లీసా విలియమ్స్ మద్దతు తెలిపారు. సోషల్ మీడియా సంస్థలు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయని అన్నారు. అలాగే సెక్స్ అంటే, ఇద్దరు కలిసిపోయి, ఇద్దరూ ఆస్వాదించేలా ఉండాలనే ఎరికా అభిప్రాయంతో కూడా లీసా ఏకీభవించారు.

Share.