నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్ కలిసి నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా మరొక 20 రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒక గట్టి షాక్ తగిలినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ చివరి భాగంలో ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పాట కూడా మాస్ సాంగ్ అని ఈ సినిమాకి హైలైట్ గా నిలిచారా ఈ సాంగ్ ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరం తర్వాత బాలయ్య ఈ చిత్రంలో తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తూ ఉండడం విశేషమని చెప్పవచ్చు.
వీర సింహారెడ్డి సినిమా నుంచి ఒక డైలాగ్ లీక్ అయిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ లీకైన డైలాగ్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండడంతో పాటు ఈ చిత్రంలో ఇదే హైలెట్ గా ఉందనే విధంగా తెలుస్తోంది..”పులివెందుల అయినా పులిచెర్ల ఆయన పులిబిడ్డ ఈ వీరసింహారెడ్డి.. ఈ వీర సింహారెడ్డి ప్రజల ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్టే.. ఆ సింహాన్ని ఎదిరించి వెళ్లే దమ్ము ఉంటే నువ్వు నన్ను దాటి ప్రజల వద్దకు వెళ్లారా” అనే డైలాగులు కావడంతో బాలయ్య అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్న చిత్ర బృందం మాత్రం షాక్ లో ఉంది.
బాలయ్య నోటి నుండి ఈ మాస్ డైలాగ్ వింటే అభిమానులు ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పవచ్చు. ఇక బాలయ్య ,శృతిహాసన్ కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి చిత్రం ఇది. గడిచిన కొద్దిరోజుల క్రితం సుందరి అనే ఒక మెలోడీ సాంగ్ విడుదల చేయడం జరిగింది. ఇందులో బాలయ్య స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వయసులో కూడా బాలయ్య ఈ స్థాయిలో డ్యాన్స్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.