కేరళకు భారీ విరాళం ప్రకటించిన లారెన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

కేరళ రాష్ట్రంలో వరదలు వలన జరిగిన నష్టం అంత ఇంత కాదు, భారీ వరదలు కేరళను అతలాకుతలం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు కొంత మెరుగు పడుతున్నాయి. మన దేశ సైనికులు, నేవి అధికారులు కేరళ వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితమైన ప్రాంతాలకి తరలించటంలో చూపిన సాహసం అందరి ప్రశంసలు అందుకుంటుంది. అయితే దేశం నలుమూలల నుండి వరద బాధితులకి విరాళాలు భారీ గానే అందుతున్నాయి. సామాన్యుడి నుండి సినిమా హీరోలు, రాజకీయ నాయకులూ అందరూ తమ వంతు సహాయం అందిస్తున్నారు.

తెలుగు హీరోలు అల్లు అర్జున్ రూ 25 లక్షలు, విజయ్ రూ 5 లక్షలు, నాగార్జున, అమల రూ 28 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న సౌత్ ఇండియా లో అందరి కంటే ఎక్కువగా తమిళ స్టార్ హీరో విజయ్ రూ 70 లక్షలు విరాళం ప్రకటించారు.

ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఏకంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు. పేదలకు, అనాధ పిల్లలకు సహాయం అందించటంలో ఎప్పుడు ముందుండే లారెన్స్ మాస్టర్ మరో సారి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం కేరళ ముఖ్యమంత్రి విజయాన్ గారిని కలిసి అధికారికంగా వారికి చెక్ అందచేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Share.