మత్తు వదలరా సినిమాతో డైరెక్టర్ గా మారాడు అది రితేష్ రానా ఇక మైత్రి మూవీస్ బ్యానర్ పై తాజాగా ఒక చిత్రం ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాటి నటిస్తోంది. ఇక ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్తడే అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది.
లావణ్య త్రిపాఠి తో పాట వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, సత్య ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్ విషయానికొస్తే.. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకొని ఫైరింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ పక్కనే స్లోగన్స్ నో ఎంట్రీ అనే క్యాప్షన్ కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏ తరహా సినిమా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వరుసగా జరుగుతూనే ఉన్నది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. లావణ్య త్రిపాఠి కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆమె భర్త డే రోజున హ్యాపీ బర్తడే టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు.