తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ జంట కథలు సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి..ఎందుకంటే ఎవరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురుస్తుందో ఎవరికీ తెలియదు.హీరో హీరోయిన్స్ కలిసి సినిమాలను చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలాగే వీరులో వివాహం కూడా చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన జంటలు కూడా మరెన్నో ఉన్నాయి. ముఖ్యంగా అప్పట్లో నాగార్జున – అమల వీరిద్దరు కూడా చాలా సైలెంట్ గా ప్రేమించుకున్న జంటలలోఒకరు.
అప్పట్లో ఎన్నో జంటలు ఉన్నాయి కానీ నాగార్జున అమల నుంచి హీరో హీరోయిన్స్ ల మధ్య ప్రేమ చిగురించి వివాహం వరకు దారి తీస్తున్నాయి. ఇప్పటికీ ఈ జంటను చాలామంది ఫాలో అవుతున్నారు. కొందరి ప్రేమలు మొదట్లోనే అంతమవుతున్నాయి. నాగచైతన్య, సమంతల ప్రేమ గురించి చెప్పాల్సిన పనిలేదు.. వివాహం చేసుకొని నాలుగేళ్లకే వీరు కలిసి ఉండలేకపోయారు.
అయితే చాలామంది సెలబ్రిటీల ప్రేమ విషయాల్లో మొదట్లోనే లీక్ అవుతాయి కానీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ప్రేమ వ్యవహారం మాత్రం ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ గా జరిగిపోయింది. నిజంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని అనుమానం కలిగింది వారి అభిమానులకు.. ఎందుకంటే వీరెప్పుడూ అలా కలిసి తిరగటం కానీ అలా ఎప్పుడూ కనిపించలేదు.కానీ ఈ మధ్య కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఆ వార్తలు కూడా ఎప్పటికప్పుడు వారు కొట్టి పడేస్తున్నారు.
ఎట్టకేలకు వీరిద్దరూ ప్రేమించుకున్నారని వార్త బయటపడి ఇప్పుడు పెద్దలను ఒప్పించి వీరి వివాహానికి ముహూర్తం నిర్ణయించుకుంటున్నారు. నిన్నటి రోజున రాత్రివేళ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ యొక్క ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా నాగబాబు ఇంట్లో జరిగినట్టుగా తెలుస్తోంది అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి వివాహ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి.