టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. వీరి పెళ్లి ఈ ఏడాది నవంబర్లో జరగబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది. వీరి నిశ్చితార్థం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అలాగే వీరి పెళ్లికూడా అంతే గ్రాండ్గా జరిపించాలని ఈ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారట. ఇటలీలోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుందని సమాచారం. ఇది కాస్త పక్కన పెడితే పెళ్లి కాకనే వరుణ్ తేజ్ కుటుంబంతో పూజలు చేస్తూ లావణ్య మెగా ఫ్యామిలీతో కలిసిపోయింది.
అయితే పెళ్లికి ముందే లావణ్య అత్తారింట్లోకి అడుగుపెట్టేసింది. వినాయక చవితి వేడుకను అత్తారింట్లో జరుపుకుంది. నిన్నటి రోజున వినాయక చవితి కావటంతో సెలబ్రిటీస్ అంతా ఇంట్లో పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు విషెస్ తెలియజేశారు.తాజాగా వరుణ్ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలో వరుణ్ తేజ్ ఫ్యామిలీతో పాటు లావణ్య కూడా కనిపించింది.
పెళ్లికి ముందే అత్తారింట్లో పండుగ వేడుకలను చాలా గ్రాండ్గా జరుపుకుంటున్న లావణ్య చూసినా మెగా అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ వైరల్ గా మారాయి. కాగా ఈ జంట ఈ మధ్యనే వారి పెళ్లికి సంబంధించిన షాపింగ్ ను మొదలుపెట్టారు. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా షోరూంలో వరుణ్ లావణ్య తమ వెడ్డింగ్ కి సంబంధించిన డ్రెస్సెస్ కోసం షాపింగ్ చేశారు.
ఇక పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైనర్ వేర్ డ్రెస్సెస్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి జంటను చూస్తుంటే అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీరి వివాహ తేదీని కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
View this post on Instagram