ఆ ఫంక్షన్ కి వచ్చేందుకు సిద్దమయిన ఎన్టీఆర్ !

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్ణయం మీద కొద్ది రోజులుగా … ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోఫిక్ ఆడియో ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే… ఈ ఆడియో ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా .. రాడా అన్న సందేహం ఇప్పటిఅరకు అందరిలోనూ ఏర్పడింది. అయితే తాజాగా… ఈ ఫంక్షన్ కి వచ్చేందుకు జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో… మరింత హుషారుగా… నిమ్మకూరులో భారీ ఎత్తున ‘ఎన్టీఆర్’ ఆడియో మరియు ట్రైలర్ కార్యక్రమాన్నిప్లాన్ చేశారట.

ఈ ఆడియో ఫంక్షన్ లో నందమూరి కుటుంబ సభ్యులు అంతా పాల్గొనబోతున్నారట. వారిలో జూనియర్ కూడా ఉండనున్నాడట. కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ లు ఆ వేడుకలో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. అంతే కాదు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ ఫంక్షన్ కి హాజరవుతున్నాడని సమాచారం.
అంతే కాదు ఈ ఫంక్షన్ కి మరో స్పెషలిటీ కూడా ఉంది. అది ఏంటి అంటే… సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన సహా నటులు… సూపర్ స్టార్ కృష్ణ , రెబల్ స్టార్ కృష్ణం రాజు మోహన్ బాబు , జమున, గీతాంజలి ఇంకా అలనాటి తారలు , దర్శకులు , నిర్మాతలు ఎంతో మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా టాక్.

ముందుగా ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ అయిష్టత వ్యక్తంచేశాడట. కానీ… స్వయాన ఆయన తాత పేరుతో తీసిన ఈ సినిమా ఫంక్షన్ కి పిలిచినా వెళ్లకపోతే… విమర్శలపాలవ్వాల్సి వస్తుందని… అందునా నందమూరి ఫ్యామిలీ అంతా గర్వంగా చెప్పుకునే… నిమ్మకూరులో ఈ వేడుక జరగనుండంతో జూనియర్ ఎన్టీఆర్ తన నిర్ణయం మార్చుకుని ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఎన్టీఆర్ ఒకే చెప్పాడని సమాచారం.

Share.